ఈ ఏడాది 2 ఈవీలు, అర డజను టూ-వీలర్లు విడుదల చేయనున్న హోండా!

by Harish |
ఈ ఏడాది 2 ఈవీలు, అర డజను టూ-వీలర్లు విడుదల చేయనున్న హోండా!
X

న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) రాబోయే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు దాదాపు అరడజను మోడళ్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయ మార్కెట్లో మరిన్ని వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగలమనే విశ్వాసం ఉందని కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా అన్నారు.

ఇదే మాదిరిగానే 2023-24లోనూ మెరుగైన వృద్ధిని సాధించాలని భావిస్తున్నాం. రానున్న నెలల్లో 125సీసీ స్కూటర్‌తో పాటు 160సీసీ, 350సీసీ మోటార్‌సైకిళ్లను తీసుకొస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చిలో తమ ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఉత్పత్తి, అమ్మకాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెనీ టూ-వీలర్ అమ్మకాల్లో కంపెనీ 21 శాతం వృద్ధిని సాధించిందని, ఇది మొత్తం పరిశ్రమ వృద్ధి 16 శాతం కంటే ఎక్కువని అట్సుషి అన్నారు.

ఈవీల కోసం కంపెనీ కొత్త తయారీ ప్లాంటును ఏర్పాటు చేసే దశలో ఉంది. ఫిక్స్‌డ్ బ్యాటరీ మిడ్-రేంజ్ ఈవీ, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యంతో కూడిన ఈవీ మోడళ్లను మరో ఏడాది కాలంలో తీసుకొస్తాం. 2030 నాటికి తాము ఏటా 10 లక్షల ఈవీల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కంపెనీ వెల్లడించింది.Next Story

Most Viewed