- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telangana Assembly Election 2023
- 2023 Cricket World Cup
Honda Activa 6G బైక్ తర్వాత వెర్షన్ టీజర్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా స్కూటీల విభాగంలో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసిన Honda Activa వేరియంట్‌లో మరో కొత్త మోడల్ రానుంది. Honda కంపెనీ బైక్‌లన్నింటిలో Activa వేరియంట్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. Honda Activa లో వరుసగా 3G, 4G, 5Gలను విడుదల చేసిన కంపెనీ ఈ మధ్యకాలంలో 6G వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ బైక్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అయితే దీని తరువాత వెర్షన్ 7Gని తీసుకొస్తుందని అనుకున్నప్పటికీ, కొత్తగా 6G వేరియంట్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ '6G ప్రీమియం ఎడిషన్(Activa Premium Edition)' అని కంపెనీ ఇటీవల ఒక టీజర్‌ను విడుదల చేసింది.
రాబోయే హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ స్కూటర్ మోడల్ గోల్డ్ డిజైన్ ఎలిమెంట్స్, గోల్డ్ 'హోండా' అని రాసి ఉన్న టీజర్ రివీల్ అయింది. కొత్త మోడల్‌లో USB ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయని సమాచారం. హోండా యాక్టివా 6G ప్రతి నెల సగటున 1.5 లక్షల అమ్మకాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్‌గా ఉంది. దీని తరువాత వెర్షన్ 6G ప్రీమియం ఎడిషన్ కూడా అత్యధికంగా అమ్మకాలను నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. త్వరలో ఈ బైక్ విడుదల తేదీ, ఫీచర్లను అధికారికంగా తెలుపనున్నారు.
A scooter that elevates your style, coming soon. pic.twitter.com/tI6IRGuJqZ
— Honda 2 Wheelers (@honda2wheelerin) August 14, 2022