హీరో బైక్ కొంటున్నారా! అయితే మీకు షాకింగ్ న్యూసే

by Disha WebDesk |
హీరో బైక్ కొంటున్నారా! అయితే మీకు షాకింగ్ న్యూసే
X

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్‌షోరూమ్ ధరలను పెంచుతున్నట్టు దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ ధరల పెంపు రూ. 1,000 వరకు ఉంటుందని, మోడల్, ప్రాంతాన్ని బట్టి వ్యత్యాసం ఉండనున్నట్లు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.

పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని, దేశంలో అధిక ద్రవ్యోల్బణం వల్ల క్రమంగా విడి భాగాల ధరలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రూ. వెయ్యి వరకు పెంచక తప్పలేదని కంపెనీ వివరించింది. కాగా, హీరో మోటోకార్ప్ టూ-వీలర్ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 1.92 శాతం పెరిగాయి.

గతేడాది ఇదే నెలలో 4.53 లక్షల యూనిట్లను విక్రయించగా, ఈసారి 4.62 లక్షల యూనిట్లకు పెరిగాయి. దేశీయ అమ్మకాలు 4.55 శాతం పుంజుకున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed