100 నగరాల్లో 1,900 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు హీరో- ఏథర్ ఒప్పందం

by Harish |
100 నగరాల్లో 1,900 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు హీరో- ఏథర్ ఒప్పందం
X

బెంగళూరు: దేశీయంగా ఈవీ టూవీలర్ల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా ఏథర్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు దేశవ్యాప్తంగా వీదా, ఏథర్‌గ్రిడ్స్ రెండింటినీ ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇరు కంపెనీలు కలిసి సంయుక్తంగా 100 నగరాల్లో 1,900 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

'దేశంలోనే అతిపెద్ద ఇంటర్‌ఆపరబుల్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు, యాక్సెస్‌కు ఈ ఒప్పందం సహాయపడుతుదని' హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ స్వదేశ్ శ్రీవాస్తవ చెప్పారు.

ఈ భాగస్వామ్యం ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇప్పుడు అత్యంత వేగంగా విస్తరించేందుకు వీలవుతుందని, భవిష్యత్తులో వినియోగదారులకు ఛార్జింగ్ సౌకర్యాల్లో ఇబ్బందులు ఉండవని భావిస్తున్నట్టు ఏథర్ ఎనర్జీ కో-ఫౌండర్ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు. హీరో మోటోకార్ప్-ఏథర్ ఎనర్జీ భాగస్వామ్యంలోని ఈ నెట్‌వర్క్ దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌గా ఉంది.



Next Story

Most Viewed