- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
PM విశ్వకర్మ యోజన: రూ.3 లక్షల లోన్.. రోజు రూ.500 స్టైఫండ్.. పూర్తి వివరాలు ఇవే!

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాన మంత్రి ఇటీవల ప్రారంభించిన PM విశ్వకర్మ యోజన అనేది చేతివృత్తుల వారికి బాగా ఉపయోగపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరి, తాపీ మేస్త్రీలు, రాతి శిల్పులు, టైలర్, బొమ్మల తయారీదారులు, చాకలి వృత్తి చేసే వారు, మంగలి, బుట్టలు తయారు చేసేవారు మొదలగు 18 రకాల చేతివృత్తుల పనుల వారు ఈ పథకానికి అర్హులు. దీని కింద ఎటువంటి గ్యారెంటీ లేకుండా ప్రభుత్వం రూ.3 లక్షల వరకు రుణం ఇస్తుంది. మొదటగా రూ. 1 లక్ష ఇస్తారు. ఈ అమౌంట్ పూర్తిగా చెల్లించిన తరువాత మిగతా రూ.2 లక్షలు అందిస్తారు. ఈ స్కీమ్‌లో తక్కువ వడ్డీకే అంటే 5 శాతం వడ్డీ రేటుతో రుణం పొందవచ్చు. ఈ పథకం కోసం కేంద్రం రూ.13,000 కోట్లను కేటాయించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం పేర్కొంది.
పథకం ప్రయోజనాలు
ఈ పథకంలో, ప్రతి లబ్ధిదారునికి 5 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇస్తారు. అలాగే రోజువారీ రూ.500 స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. ఇది కాకుండా, టూల్‌కిట్ కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకంగా రూ.15,000 గ్రాంట్ అందిస్తారు. ఇంకా డిజిటల్ లావాదేవీల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ఇస్తారు. హస్తకళాకారులు, వివిధ చేతివృత్తుల వారిని వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేయడమే ఈ పథకం ఉద్దేశం.
అవసరమైన పత్రాలు
1. ఆధార్ కార్డు
2. గుర్తింపు కార్డు
3. అడ్రస్ ప్రూఫ్
4. మొబైల్ నంబర్
5. కుల ధృవీకరణ పత్రం
6. బ్యాంకు ఖాతా పాస్ బుక్
7. పాస్పోర్ట్ సైజ్ ఫొటో
అధికారిక వెబ్‌సైట్: https://pmvishwakarma.gov.in/