పన్నులు చెల్లించని సంస్థలను గుర్తించే పనిలో జీఎస్టీ విభాగం!

by Dishafeatures2 |
పన్నులు చెల్లించని సంస్థలను గుర్తించే పనిలో జీఎస్టీ విభాగం!
X

న్యూఢిల్లీ: జీఎస్టీ విభాగం త్వరలో వ్యాపారాలు, ప్రొఫెషనల్స్ దాఖలు చేసిన ఐటీఆర్ ఫైలింగ్‌లను విశ్లేషించనున్నట్టు తెలుస్తోంది. ఆయా సంబంధిత కంపెనీలు, వ్యక్తులు తమ జీఎస్టీ చెల్లింపుల పట్ల నిర్వహిస్తున్న బాధ్యతను పరిశీలించేందుకు ఎంసీఏ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) ఫైలింగ్‌లను విశ్లేషించనుంది. తాము ఐటీ విభాగం వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా డేటాను పరిశీలిస్తాం. జీఎస్టీ కింద పన్నులు చెల్లించని రిజిస్టర్డ్ సంస్థలు, వ్యక్తులు ఉంటే గనక మొదట చివరాణ చేపడతామని ఓ అధికారి తెలిపారు. అనంతరం డేటా విశ్లేషించి మినహాయింపు లేని కంపెనీలపై దృష్టి సారిస్తాం. వారు నెలవారీ లేదా త్రైమాసికానికి రిటర్న్‌లను ఫైల్ చేయాలి. ఒకవేళ అలాంటి వారు జీఎస్టీ చట్టాన్ని పాటించకపోతే తర్వాతి దశలో అందుకు గల కారణాలను వివరించాలని కోరడం జరుగుతుందని వివరించారు.

ఏదైనా జీఎస్టీ ఎగవేత ఉందో లేదో ఎంసీఏ త్రైమాసిక, వార్షిక డేటా ద్వారా బహిర్గతం అవుతుంది. దీనికి మొదట ఐటీ విభాగం, జీఎస్టీ డేటాను పోల్చడం, తర్వాత ఎంసీఏ ఫైలింగ్ డేటాతో పోల్చడం జరుగుతుందని అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం 2017, జూలై 1 నుంచి అమలైన జీఎస్టీ కింద 1.38 కోట్ల నమోదిత వ్యాపారులు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. తయారీలో రూ. 40 లక్షలు, సేవల రంగంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపారులు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలి. అలాగే పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, వ్యవసాయదారులు, విద్యుత్ ప్రసార లేదా పంపిణీ సంస్థలు, క్లినిక్ ద్వారా వైద్య సేవలు వంటి పలు సేవా రంగంలోని వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది.


Next Story