సంపదను సృష్టించడం ప్రైవేట్ రంగం పని: నీతి ఆయోగ్ సీఈఓ!

by Disha Web |
సంపదను సృష్టించడం ప్రైవేట్ రంగం పని: నీతి ఆయోగ్ సీఈఓ!
X

న్యూఢిల్లీ: సంపదను సృష్టించడం ప్రైవేట్ రంగానికి సంబంధించిందని, విధానాలను రూపొందించడం పై ప్రభుత్వం దృష్టి సారించాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ గురువారం ఓ కార్యక్రమంలో చెప్పారు. గవర్న్‌మెంట్-టెక్ సమ్మిట్-2022 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత్‌కు సులభమైన, సమర్థవంతమైన, పారదర్శకత కలిగిన ప్రభుత్వం అవసరమన్నారు. ప్రైవేటు రంగం సంపదను సృష్టించుకోవాలి, ప్రభుత్వం విధానాలను రూపొందించాలి. కానీ, ఆరోగ్య, విద్య, పోషకాహారం లాంటి వాటి పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉండాలని అమితాబ్ కాంత్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ ఎకానమీకి సంబంధించి కీలకమైన డిజిటలైజేషన్ దశకు భారత్ చేరుకుంది. ఈ మొత్తం ప్రక్రియ పరివర్తన మార్గంలో కొనసాగుతోందన్నారు.

దేశంలోని తూర్పు ప్రాంతాలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయగలిగితే ప్రభుత్వ పాలన అక్కడ సులభతరం అవుతుందని, మరింత మెరుగైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన వివరించారు. దీనికోసం డేటా ఆధారిత పాలన కీలకమని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన అమితాబ్ కాంత్ రానున్న మూడు దశాబ్దాల్లో భారత్ 8-9 శాతం వృద్ధి సాధించడమనే అంశం సవాళ్లతో కూడుకున్నదన్నారు. భారతీయ తయారీదారులు ప్రపంచ మార్కెట్లతో పాటు విలువైన సరఫరాను కలిగి ఉండటం ముఖ్యం. టెక్నాలజీ పరంగా మాత్రమే దూసుకెళ్లడం కాకుండా గణనీయంగా వృద్ధి సాధించడం కష్టసాధ్యమని ఆయన తెలిపారు.

Next Story