- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టెస్లాకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు లేవు!
దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా గత కొంత కాలంగా భారత్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే దేశంలో తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి పన్ను మినహాయింపులు, ప్రోత్సహకాలు కోరుతుంది. దీనికి కేంద్రం మాత్రం ససేమిరా అంటుంది. కానీ ఇటీవల ప్రభుత్వం కూడా టెస్లా ప్రతిపాదనలపై సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ఈవీ విభాగంలో ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎలాంటి పన్ను మినహాయింపులు, ప్రోత్సహకాలు ఇవ్వడం కుదరదని, ఒకవేళ ఇలాంటివి ఇవ్వాలనుకుంటే ఈవీ తయారీ కంపెనీలు అన్నింటికి ఇస్తామని, ఏ కంపెనీకి కూడా ప్రత్యేక మినహాయింపులు ఉండవని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అయితే టెస్లా తమ ప్రతిపాదనలపై ప్రభుత్వంతో చర్చలు జరిపింది నిజమే అయినప్పటికి దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు.
సాధారణంగా పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై 100 శాతం పన్ను విధిస్తారు. అయితే టెస్లా ఈ విషయంలో కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా ఈ పన్నును 40 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.