EPFO నుంచి గుడ్‌న్యూస్! గరిష్ట వేతన పరిమితి రూ. 21 వేలు..?

by Disha Web Desk 17 |
EPFO నుంచి గుడ్‌న్యూస్! గరిష్ట వేతన పరిమితి రూ. 21 వేలు..?
X

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని ప్రభుత్వం సవరించనున్నట్లు తెలుస్తోంది. పెన్షన్ పథకంలో ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని ఇప్పుడున్న రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే అవకాశం ఉందని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ఖాయమైతే ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించే వాటా పెరుగుతుందని, దీనివల్ల ఉద్యోగుల ఈపీఎఫ్ఓ ఖాతాల్లో జమయ్యే మొత్తం పెరగనుంది.

ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితి చివరిగా 2014లో రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచారు. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుంది. తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించనున్నట్లు సమాచారం.

ద్రవ్యోల్బణం ఆధారంగా గరిష్ట వేతన పరిమితిని ప్రభుత్వం నియమించే కమిటీ సమీక్షిస్తుంది. గరిష్ట వేతన పరిమితి పెరిగితే దాని ప్రకారం ఉద్యోగి వాటా, యజమాని వాటా కూడా పెరుగుతుంది. పెన్షన్‌ ఖాతాలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది. దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి వస్తారు.


Next Story

Most Viewed