- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌కు 50 ఏళ్ల చెల్లుబాటు
లైసెన్స్ వ్యాలిడిటీని ఏకంగా 50 ఏళ్లకు పెంచే భారీ ప్రతిపాదనను కేంద్ర రోడ్డు రవాణా శాఖ పరిశీలిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని కోట్లాది వాహనదారులకు ఊరట కలిగించే కీలక మార్పును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే అది 20 సంవత్సరాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరిగి, కొన్ని సందర్భాల్లో మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ తలనొప్పులన్నింటికీ చెక్ పెడుతూ.. లైసెన్స్ వ్యాలిడిటీని ఏకంగా 50 ఏళ్లకు పెంచే భారీ ప్రతిపాదనను కేంద్ర రోడ్డు రవాణా శాఖ పరిశీలిస్తోంది. పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తప్పు చేస్తే లైసెన్స్ రద్దు
అదే సమయంలో, డ్రైవింగ్ లైసెన్సులు, వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్‌ఫర్, పర్మిట్ రిన్యూవల్స్ వంటి సేవలను పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందుబాటులోకి తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. లైసెన్స్ వ్యాలిడిటీ 50 ఏళ్లకు పెంచితే రెన్యూవల్ ఫీజులు రాక రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోతుందేమో అని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. కానీ, ఫీజుల వసూళ్లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా కొనసాగిస్తామని, దీనివల్ల ఎలాంటి ఆదాయ నష్టం ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే, 50 ఏళ్ల వ్యాలిడిటీ ఇచ్చారు కదా అని ట్రాఫిక్ రూల్స్ ఇష్టమొచ్చినట్లు బ్రేక్ చేస్తే మాత్రం కుదరదని ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్ల అకౌంట్లో నెగటివ్ పాయింట్లు వేసి, అవి ఎక్కువైతే లైసెన్స్‌ను డైరెక్ట్‌గా సస్పెండ్ లేదా రద్దు చేసే కఠినమైన ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా ఈ కొత్త రూల్‌తో పాటు తీసుకురానున్నారు. ఈ ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.






