నకిలీ లోన్‌ యాప్‌‌ల బెడద తగ్గించడానికి ప్లే స్టోర్ నిబంధనలు కఠినతరం

by Disha Web Desk 17 |
నకిలీ లోన్‌ యాప్‌‌ల బెడద తగ్గించడానికి ప్లే స్టోర్ నిబంధనలు కఠినతరం
X

న్యూఢిల్లీ: నకిలీ లోన్ యాప్‌ల ముప్పును ఎదుర్కొనేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీని మరింత కఠినతరం చేస్తూ, ఇకమీదట గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్‌లను ఉంచేందుకు ఖచ్చితమైన ధృవపత్రాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు ఈ ఏడాది మే 31 నుంచి అమలవుతాయని వెల్లడించింది. అంతేకాకుండా వ్యక్తీగత లోన్ యాప్‌లు వినియోగదారులకు చెందిన ఫోటోలు, వీడియోలు, కాల్స్, లొకేషన్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకూడదని యాప్ యజమానులకు నిబంధనలు విధించింది.

వ్యక్తిగత లోన్ యాప్ డిక్లరేషన్ పత్రాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా రుణాలు ఇవ్వకుండా బ్యాంకింగేతర సంస్థలకు మధ్యవర్తి అయితే ఆ విషయాన్ని డిక్లరేషన్ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనాలని గూగుల్ తెలిపింది. ఇక, ప్లే స్టోర్‌లో యాప్‌ను పబ్లిష్ చేసేందుకు గూగుల్ ప్లే కన్సోల్‌లో యాప్ కేటగిరీని ఫైనాన్స్‌గా ఎంపిక చేయాలి. కాగా ఈ వివరాల గురించి స్పష్టమైన సమాచారం అందించిన తర్వాత సమీక్షించేందుకు గూగుల్ సుమారు వారం రోజుల సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.



Next Story

Most Viewed