దేశీయంగా 453 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్!

by Disha Web Desk 17 |
దేశీయంగా 453 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ దేశీయంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 453 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి సమయంలో మెయిల్ ద్వారా గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్-ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి.

అయితే, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ గత నెలలో ప్రకటించిన 12 వేల మంది ఉద్యోగుల తొలగింపుల్లో భాగంగా ఈ 453 మందిని తీసేశారా లేక ఇది అదనమా అనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై గూగుల్ సంస్థ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. గత నెల గూగుల్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపులకు బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అమెరికా కాకుండా ఇతర దేశాల్లో తొలగించే ఉద్యోగులకు స్థానిక కంపెనీల నిబంధనల ప్రకారం, చట్టాలను అనుసరిస్తూ పరిహారం, సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, గూగుల్‌తో పాటు ఇతర గ్లోబల్ దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed