మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర

by samatah |
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మహిళలు ఇష్టపడే దాంట్లో ముందు ఉండేది, బంగారమే, ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వారు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

కానీ నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.550 పెరగడంతో గోల్డ్ ధర రూ.56,650గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.600 పెరగడంతో గోల్డ్ ధర రూ.61,800గా ఉంది.

ఇవి కూడా చదవండి:

Telugu Panchangam 15 ఏప్రిల్ : నేడు శుభ, అశుభ సమయాలివే !

Next Story