రూ. లక్ష కోట్లు దాటిన బంగారం దిగుమతులు!

by Disha Web Desk 6 |
రూ. లక్ష కోట్లు దాటిన బంగారం దిగుమతులు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో దేశ కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపే భారత బంగారం దిగుమతులు 6.4 శాతం పెరిగి రూ. 1.02 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పరిశ్రమలో గణనీయమైన డిమాండ్ పరిస్థితుల కారణంగానే దిగుమతులు భారీగా పెరిగాయని గణాంకాలు తెలిపాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 95.74 వేల కోట్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ తాజా గణాంకాలు పేర్కొన్నాయి. అయితే కేవలం జూలైలో మాత్రమే బంగారం దిగుమతులు 43.6 శాతం క్షీణించి రూ. 19.14 వేల కోట్లు(2.4 బిలియన్ డాలర్లు)గా నమోదయ్యాయి. 2022-23 మొదటి నాలుగు నెలల్లో బంగారం, చమురు దిగుమతులు పెరగడంతో సమీక్షించిన కాలంలో వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో రూ. 2.93 లక్షల కోట్ల(30 బిలియన్ డాలర్ల)కు పెరిగింది.

గతేడాది ఇదే సమయంలో రూ. 84.81 వేల కోట్లు(10.63 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. చైనా తర్వాత అత్యధికంగా పసిడిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ప్రధానంగా ఆభరణాల తయారీ కోసం బంగారం పెద్ద మొత్తం దిగుమతుంది. ఏప్రిల్-జూలై మధ్య రత్నాభరణాల ఎగుమతులు 7 శాతం పెరిగి రూ. 1.07 లక్షల కోట్ల(13.5 బిలియన్ డాలర్ల)కు చేరుకోగా, వాణిజ్య లోటు అత్యధికంగా ఉండటంతో దేశ కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.2 శాతానికి చేరుకుంది. కాగా, శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు 24 క్యారెట్ల పది గ్రాములు స్వల్పంగా తగ్గి రూ. 52,150 ఉండగా, 22 క్యారెట్లు రూ. 47,800గా ఉంది. వెండి కిలో రూ. 62 వేలుగా ఉంది.


Next Story

Most Viewed