4,000 మందిని తొలగించిన నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో

by S Gopi |
4,000 మందిని తొలగించిన నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతున్నాయి. గతేడాది ప్రారంభంలో మొదలైన మాంద్యం భయాలు ఉద్యోగులపై ఇప్పటికీ ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో పలు దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గ్లోబల్ నెట్‌వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ 4,000 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 2023 నాటికి సిస్కోలో మొత్తం 85,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా లేఆఫ్స్ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానం. కంప్యూటర్ నెట్‌వర్కింగ్ పరికరాల తయారీలో అతిపెద్ద సంస్థ అయిన సిస్కో అంతర్జాతీయంగా ఈ తొలగింపుల ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ప్రధానంగా కేబుల్ సర్వీసులతో పాటు టెలికాం విభాగాల నుంచి డిమాండ్ మందగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. టెలికాం పరిశ్రమలోని క్లయింట్ల ఖర్చును తగ్గించడం, నెట్‌వర్కింగ్ గేర్‌ల ఇన్వెంటరీలను క్లియర్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది. గత కొంతకాలంగా సిస్కో ఉత్పత్తులకు డిమాండ్ బలహీనంగా ఉందని పరిశ్రమ వర్గాలు సైతం వెల్లడించాయి. మరోవైపు, ఈ ఏడాదిలో ఇప్పటికే పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ ప్రకారం, 2024 ప్రారంభం నుంచి ఉప్పటివరకు టెక్ రంగంలో మొత్తం 35,000 మంది ఉద్యోగుల తొలగింపులు జరిగాయి.Next Story

Most Viewed