మోసపూరిత ట్రేడింగ్ పథకాలను నమ్మొద్దని ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక

by Dishanational1 |
మోసపూరిత ట్రేడింగ్ పథకాలను నమ్మొద్దని ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక
X

దిశ, బిజినెస్ బ్యూరో: మోసపూరిత ట్రేడింగ్ స్కీమ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పెట్టుబడిదారులను హెచ్చరించింది. సెబీ నమోదిత ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థల పేరుతో మోసపూరిత ట్రేడింగ్ పథకాలను ఆశ చూపిస్తున్నారు. దీనికి సంబంధించి సెబీ నమోదిత ఎఫ్‌పీఐల నకిలీ సంబంధాలను సూచించే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని సెబీ పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు ఎఫ్‌పీఐ లేదా ఎఫ్ఐఐ సబ్-అకౌంట్స్, ప్రత్యేక ఇన్‌స్టిట్యూషనల్ అకౌంట్ల ద్వారా ట్రేడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు సమాచారం ఉంది. ' మోసగాళ్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్‌లు, స్టాక్ మార్కెట్లలోని మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఇన్వెస్టర్లను ప్రలోభపెడుతున్నారు. వాట్సాప్, టెలిగ్రాం, సోషల్ మీడియాల ద్వారా ఇన్వెస్టర్లకు సులభంగా చేరువ అవుతున్నారు. సెబీ నమోదిత ఎఫ్‌పీఐ ఉద్యోగులు, అనుబంధ కంపెనీల పేరుతో మదుపర్లు డీమ్యాట్ లేకపోయినా షేర్లు కొనేలా, ఐపీఓలో సబ్‌స్క్రైబ్ చేసుకునేలా, ఇతర నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసేలా ప్రేరేపిస్తున్నారని' సెబీ వివరించింది.

ఈ మోసాలు చేసేందుకు వారు నకిలీ పేర్లు, అడ్రస్‌తో కూడిన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తున్నారని సెబీ తెలిపింది. సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం, ఎఫ్‌పీఐల ద్వారా భారతీయ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టే ఎలాంటి మార్గాలు లేవని గుర్తించుకోవాలని స్పష్టం చేసింది. సెబీలో నమోదైన ఎఫ్‌పీఐలు లేదా ఎఫ్ఐఐలు స్టాక్ మార్కెట్ యాక్సెస్ సులభతరం చేసే ఎలాంటి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రాం ఛానెల్ లేదా యాప్‌ల మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని సెబీ వెల్లడించింది.


Next Story

Most Viewed