రెండు వారాల్లో రూ. 22 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!

by Disha Web Desk 7 |
రెండు వారాల్లో రూ. 22 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ పెట్టుబడిదారులు!
X

ముంబై: గతేడాది అక్టోబర్ నుంచి వరుస నెలల్లో అమ్మకాలను సిద్ధపడిన విదేశీ పెట్టుబడిదారులు గత కొన్ని వారాలుగా తిరిగి భారత ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఈ నెల మొదటి రెండు వారాల్లోనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) దేశీయ స్టాక్ మార్కెట్లలొ మొత్తం రూ. 22,452 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గిన నేపథ్యంలో ఎఫ్ఐఐలు మళ్లీ భారత ఈక్విటీలపై వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అంతకుముందు జూలైలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) దాదాపు రూ. 5,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. 2021, అక్టోబర్‌లో మొదలైన విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జూన్ నాటికి రూ. 2.46 లక్షల కోట్ల నిధులను భారత ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. కానీ, జూలై నెల నుంచి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకోవడం, ప్రభుత్వం తగిన నిర్ణయాలు అమలు చేస్తున్న తరుణంలో విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం ప్రారంభించాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రైటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. కాగా, గతావరం విడుదల ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జూలై భారత రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతానికి తగ్గింది.


Next Story

Most Viewed