మేలో రూ. 30 వేలు కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు

by Dishanational2 |
మేలో రూ. 30 వేలు కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు
X

ముంబై: మెరుగైన ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లు దిగొచ్చే అవకాశాలు, సానుకూల త్రైమాసిక ఫలితాలు వంటి కారణాలతో ఈ నెల విదేశీ మదుపర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 30 వేల కోట్ల నిధులు పెట్టారు. భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరికొంతకాలం ఇలాగే కొనసాగుతాయని, ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ, కార్పొరేట్ ఆదాయ వృద్ధి అవకాశాలు అత్యంత సానుకూలంగా కనిపిస్తున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, మే 2-19వ తేదీల మధ్య ఎఫ్‌పీఐలు రూ. 30,945 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలలో రూ. 11,630 కోట్లను, మార్చిలో రూ. 7,936 కోట్ల ఇన్వెస్ట్ చేశారు. ఈక్విటీల్లోనే కాకుండా డెట్ మార్కెట్లలోనూ ఎఫ్‌పీఐలు రూ. 1,057 కోట్లతో మెరుగైన పెట్టుబడులు పెట్టారు. ఆటో, ఆటో విడిభాగాలు, కేపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, టెలికాం, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో విదేశీ ఇన్వెస్టర్లు అత్యధికంగా నిధులు పెట్టారు.

Also Read...

రూ. లక్ష కోట్ల మార్కు దాటిన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు


Next Story

Most Viewed