సైగలతో వీడియో KYC సేవలు ప్రారంభించిన అమెజాన్ పే

by Harish |
సైగలతో వీడియో KYC సేవలు ప్రారంభించిన అమెజాన్ పే
X

బెంగళూరు: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అమెజాన్ పే శుక్రవారం సరికొత్త సేవలను ప్రారంభించింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వినియోగదారుల కోసం వీడియో సైన్ లాంగ్వేజ్ కేవైసీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఫిన్‌టెక్ ఉద్యోగులతో వినికిడి లేదా మాట్లాడలేని వినియోగదారులు సైగలతో మాట్లాడి తమకు కావాల్సిన సేవలను పొందవచ్చని అమెజాన్ పే తెలిపింది.

సైగలతో సంభాషించే వారికి కేవైసీ ప్రక్రియను మరింత చేరువ చేసే లక్ష్యంతో దీన్ని తెచ్చామని, ఈ నిర్ణయంతో భవిష్యత్తులో వారికి డిజిటల్ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ పేర్కొంది. ఈ సేవలను అందించేందుకు అమెజాన్ పే 120 కంటే ఎక్కువ మంది తమ ఉద్యోగులకు సైగలతో మాట్లాడే పద్దతిలో శిక్షణ ఇచ్చింది.

అందుకవసరమైన ఇంటరాక్టివ్ మాడ్యూల్స్‌ను అభివృద్ధి చేసింది. 'అమెజాన్ పే కస్టమర్లకు అవసరాలను తీర్చే లక్ష్యంలో భాగంగా ఈ వీడియో సైన్ లాంగ్వేజ్ కేవైసీని తీసుకొచ్చాం. ఇది చాలా మంది వినియోగదారులకు సులభంగా సేవలందిస్తుందని అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ వికాస్ బన్సాల్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed