వరుసగా ఆరోరోజు లాభపడ్డ సూచీలు

by Dishanational1 |
వరుసగా ఆరోరోజు లాభపడ్డ సూచీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సెషన్‌లో సూచీలు మరోసారి రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పెద్దగా మద్దతు లేకపోయినప్పటికీ దేశీయంగా కీలక రంగాల్లో కనబడిన కొనుగోళ్లతో వరుసగా ఆరో రోజు లాభపడ్డాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో కొద్దిసేపు నష్టాలు ఎదురైనప్పటికీ ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్ల కోసం మదుపర్లు ఆసక్తి చూపడంతో ర్యాలీ సానుకూలంగా మారింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకింగ్ షేర్లలో ఉత్సాహం కనిపించింది. ఈ క్రమంలోనే నిఫ్టీ వరుసగా కొత్త గరిష్ఠాలను తాకింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 349.24 పాయింట్లు లాభపడి 73,057 వద్ద, నిఫ్టీ 74.70 పాయింట్ల లాభంతో 22,196 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, ఫైనాన్స్, బ్యాంకింగ్, రియల్టీ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి. టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.96 వద్ద ఉంది.


Next Story