యూఎస్, చైనాలకు భారీగా తగ్గిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు!

by Dishafeatures2 |
యూఎస్, చైనాలకు భారీగా తగ్గిన ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో భారత్ నుంచి కీలక మార్కెట్లు అమెరికా, చైనాలకు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు గణనీయంగా క్షీణించాయని పరిశ్రమ సంఘం ఇంజినీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌(ఈఈపీసీ) ఇండియా ఆదివారం ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో కొత్తగా వాణిజ్య ఒప్పందం చేసుకున్న యూఏఈ, ఆస్ట్రేలియాలకు ఎగుమతులు పెరిగాయి. అమెరికాలో డిమాండ్ తగ్గడం, మాంద్యం భయాల కారణంగా ఆ దేశానికి ఎగుమతులు పడిపోయాయని ఈఈపీసీ ఇండియా వెల్లడించింది. గత నెలలో భారత్ నుంచి సుమారు రూ. 11.80 వేల కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. ఇది గతేడాది మే కంటే 19.6 శాతం తగ్గింది.

అలాగే, ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్య ఈ ఎగుమతులు 22.3 శాతం తగ్గాయి. ఇక, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులకు మరో కీలక మార్కెట్ చైనాకు కూడా గత నెలలో ఎగుమతులు 10.5 శాతం పడిపోయి సుమారు రూ. 1600 కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్-మే మధ్య ఏడాది ప్రాతిపదికన కూడా 13 శాతం క్షీణత నమోదైంది. ఇదే సమయంలో యూఏఈ, ఆస్ట్రేలియాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు పెరిగాయి. యూఏఈకి 32 శాతం పెరిగి రూ. 4,650 కోట్లకు చేరగా, ఆస్ట్రేలియాకు 17.4 శాతం పెరిగాయని ఈఈపీసీ ఇండియా పేర్కొంది.


Next Story

Most Viewed