ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా కోసం ప్రీ లాంచ్‌ బుకింగ్స్‌ ప్రారంభించిన ఎరీషా ఈ మొబిలిటీ

by Disha WebDesk |
ఎలక్ట్రిక్‌ ఆటో రిక్షా కోసం ప్రీ లాంచ్‌ బుకింగ్స్‌ ప్రారంభించిన ఎరీషా ఈ మొబిలిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పూర్తి విద్యుత్‌ వాహనాలను ఎగుమతి చేయడంతో పాటుగా హైడ్రోజన్‌ ఇంధన బస్సుల తయారీ, పంపిణీ , ఎగుమతి రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రానా గ్రూప్‌ సంస్ధ ఎరీషా ఈ మొబిలిటీ ఈ పండుగ సీజన్‌లో విద్యుత్‌ వాహన మార్కెట్‌లో సంచనాలను సృష్టించడానికి సిద్ధమైంది. తమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎలక్ట్రిక్‌ కార్గో ఈ–సుపీరియర్‌ మరియు ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ వాహన మూడు చక్రాల ఆటో రిక్షా ఈ–స్మార్ట్‌ను ఎల్‌5 విభాగంలో అక్టోబర్‌ 02, 2022 నుంచి ముందస్తు బుకింగ్స్‌ కోసం అనుమతించినట్లు వెల్లడించింది.

ఈ–ఆటోల ప్రీ లాంచ్‌ బుకింగ్‌ గురించి రానా గ్రూప్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దర్శన్‌ రానా మాట్లాడుతూ ''ఎరీషా ఈ మొబిలిటీ ప్రధానంగా పర్యావరణ అనుకూల, అందుబాటు ధరలోని రవాణా అవకాశాలను భారతదేశ వాసులకు అందించాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ –ఆటోను భారతదేశంలో నేపథ్యీకరించడంతో పాటుగా భారత మార్కెట్‌ కోసం తీర్చిదిద్దాము. ఈ ఈ –ఆటో ఒక్కసారి చార్జ్‌ చేస్తే 120–142 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. భారతదేశంలో తుది మైలు కనెక్టివిటీ అవసరాలు తీర్చడంతో పాటుగా దేశంలో విద్యుత్‌ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా చేసుకుంది. మా ఎలక్ట్రిక్‌ కార్గో ఈ – సుపీరియర్‌ మరియు ఎలక్ట్రిక్‌ ప్యాసెంజర్‌ వాహనాలు, ఎలక్ట్రిక్‌ మూడుచక్రాల ఆటో రిక్షా ఈ–స్మార్ట్‌తో ప్రభుత్వ కర్బన ఉద్గార లక్ష్యాలకు మద్దతునందిస్తుంది'' అని అన్నారు

ఈ–సుపీరియర్‌, ఈ–స్మార్ట్‌ వాహనాలలో 51 వోల్టుల లిథియం–అయాన్‌ బ్యాటరీ ఉంది. ఇది 120–142 కిలోమీటర్ల దూరాన్ని ఒక్కసారి చార్జింగ్‌ తో అధిగమించేందుకు తోడ్పడుతుంది. ఏదైనా స్టాండర్డ్‌ చార్జర్‌తో 4–5 గంటలతో ఈ బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఈ రెండు వాహనాలూ తెలుపు రంగులో రెడ్‌ కలర్‌ డోర్స్‌తో వస్తాయి. వీటిపై 39 నెలల స్టాండర్డ్‌ వారెంటీ ఉంది.

ఈ –ఆటో డెలివరీలు నవంబర్‌ 2022 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన వినియోగదారులు 2100 రూపాయలను కంపెనీ వెబ్‌సైట్‌ (www.erishaev.com)పై చెల్లించి లేదా భారతదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్‌ నెట్‌వర్క్‌ వద్ద చెల్లించవచ్చు.

For booking information, visit: https://www.erishaev.com or call Toll free number 18004193980

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed