- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
మద్యం మత్తులో ఇండిగో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తన వ్యక్తి

బెంగళూరు: విమాన ప్రయాణాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలు పెరుగుతున్నాయి. సోమవారం జైపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో మద్యం సేవించి, సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ సదరు వ్యక్తి మద్యం మత్తులో సిబ్బందితో అదే తరహాలో ప్రవర్తించడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత పోలీసులకు అతడిని అప్పగించారు. 'ఇండిగో సంస్థ నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ప్రయాణికుడిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం సదరు వ్యక్తి బెయిల్‌పై విడుదలయ్యాడని వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇండిగో సంస్థ అధికారికంగా స్పందించింది. మద్యం మత్తులో సదరు వ్యక్తి ప్రవర్తన వల్ల కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది.