BuzzFeed to cut 12% of its workforce : ఉద్యోగుల తొలగింపు బాటలో బజ్‌ఫీడ్

by Disha Web Desk 17 |
BuzzFeed to cut 12% of its workforce : ఉద్యోగుల తొలగింపు బాటలో బజ్‌ఫీడ్
X

దిశ, వెబ్‌డెస్క్: డిజిటల్ మీడియా కంపెనీ బజ్‌ఫీడ్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగులలో 12 శాతం లేదా దాదాపు 180 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించనుంది. ఈ విషయాన్ని బజ్‌ఫీడ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సవాళ్లు, ఇన్‌పుట్ ఖర్చులు మొదలగు కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ''2023లో బజ్‌ఫీడ్ విస్తరణ ప్రణాళికలు కలిగి ఉంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోవాలంటే, ఖర్చులు తగ్గించి, అత్యుత్తమ సేవలు అందించే విభాగంలో పెట్టుబడులు పెంచాల్సి ఉందని'' కంపెనీ CEO జోనా పెరెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ తొలగింపులు ఎక్కువగా సేల్స్, ప్రొడక్షన్, టెక్, కంటెంట్ విభాగాల్లో ఉంటాయి. ఇంకా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం చివరి నాటికి చాలా ఉద్యోగాలను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. దీనికి సంబంధించిన ముందస్తు ప్రణాళికను కూడా సిద్ధం చేయనుంది.



Next Story

Most Viewed