దానితో జాగ్రత్త.. భారత బ్యాంకింగ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్..

by Dishafeatures2 |
దానితో జాగ్రత్త.. భారత బ్యాంకింగ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాంకింగ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దాదాపు 200 మొబైల్ యాప్స్ ద్వారా వారు టార్గెట్ చేయబడుతున్నారని ప్రభుత్వ సీఈఆర్‌టీ-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా) తన హెచ్చరికల్లో పేర్కొంది. సోవా అనే సరికొత్త మాల్వేర్ క్యాంపెయిన్ ద్వారా దాదాపు 200 మొబైల్ అప్లికేషన్లను వినియోగిస్తూ భారత బ్యాంకింగ్ వినియోగదారులను టార్గెట్ చేస్తోందని పేర్కొంది. ఈ మాల్వేర్ ఫేక్ ఆండ్రాయిడ్ యాప్స్‌లో కనిపించకుండా ఉంటుందని, ఆ అప్లికేషన్లన్నీ కూడా ప్రముఖమైన, చట్టబద్దమైనవిగా పేర్కొంటూ వినియోగదారులను మోసం చేసేందుకు ఆకర్షిస్తున్నాయని సీఈఆర్‌టీ తన హెచ్చరికల్లో పేర్కొంది.

సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ ద్వారా సీఈఆర్‌టీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ మాల్వేర్ ప్రథమంగా యూఎస్ఏ, రష్యా, స్పెయిన్ వంటి దేశాలపై ఫోకస్ చేసిందని పేర్కొంది. అయితే 2022 జులై నుండి ఈ మాల్వేర్ తన జాబితాలో ఇండియాను కూడా చేర్చుకుందని ఏజెన్సీ తెలిపింది. అంతేకాకుండా వినియోగదారులు తమ బ్యాంకింగ్ అప్లికేషన్లలో లాగిన్ అయినప్పుడు వారి వివరాలన్నీ దొంగలించబడతాయని, ఆ తర్వాత వాటిని వినియోగించుకుని యూజర్ల ఖాతాల్లో ఉన్న నగదును కాజేస్తున్నారని సంస్థ పేర్కొంది.

'రిపోర్ట్ ప్రకారం.. ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్స్ వంటి స్పిషింగ్ (ఎస్ఎంఎస్ ద్వారా ఫిషింగ్) వంటి దాడుల ద్వారా వస్తుంది. ఒక్కసారి ఫేక్ అప్లికేషన్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే అది మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్‌ల జాబితాను సీ2 (కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్)కు పంపుతుంది. దీని ద్వారా అటాక్ చేసే వ్యక్తి ఏ అప్లికేషన్‌లను టార్గెట్ చేసుకోవాలో నిర్ణయించుకుంటాడు' అని సీఈఆర్‌టీ పేర్కొంది.



Next Story