అదానీ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే!

by Disha Web Desk 13 |
అదానీ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే!
X

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తరహా మార్కెట్ ఒడిదుడుకులను నివారించేందుకు నియంత్రణా యంత్రంగంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేవని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో నియంత్రణా యంత్రంగాన్ని పటిష్టం చేసే కమిటీని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం లేదు.

ఈ కమిటీ కోసం నిపుణుల పేర్లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. అదానీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌లపై సోమవారం విచారణ జరగ్గా, త్వరలోనే కమిటీలో ఉండబోయే నిపుణుల పేర్లను అందజేస్తామని, వారి వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వనున్నట్టు వివరించింది. హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ ధరలు భారీగా నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్లలో లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై పిటిషన్‌లు దాఖలు కాగా, వాటిని సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించాయి. భారత పెట్టుబడిదారుల సంపదను రక్షించే అవసరం ఉందని, దానికి సమర్థవంతమైన యంత్రాంగం కావాలని పేర్కొంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సూచించింది.

Also Read..

జనవరిలో 17 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహనాల విక్రయాలు!



Next Story

Most Viewed