బైజూస్ సీఈఓగా రవీంద్రన్ తొలగింపునకు ఈజీఎం తీర్మానం

by Dishanational1 |
బైజూస్ సీఈఓగా రవీంద్రన్ తొలగింపునకు ఈజీఎం తీర్మానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో ఎదురీదుతున్న రవీంద్రన్‌ పట్ల ఇన్వెస్టర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ సీఈఓ పదవి నుంచి అతనిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన కంపెనీ అసాధారణ సమావేశం(ఈజీఎం)లో మెజారిటీ వాటాదారులు రవీంద్రన్‌ను, కంపెనీ బోర్డు సభ్యులుగా ఉన్న అతని కుటుంబసభ్యులను తొలగించాలని తొలగించాలని ఓటు వేశారు. బైజుస్‌లో ఆర్థిక అవకతవకలతో పాటు నిర్వహణ లోపాలు, నిబంధనల ఉల్లంఘనలను ప్రశ్నిస్తూ కంపెనీలోని ప్రోసస్, జనరల్ అట్లాంటిక్ మరియు పీక్ ఎక్స్‌వీ సహా మిగిలిన ఇన్వెస్టర్లు ఈజీఎంకు ఆహ్వానించారు. ఈ సమావేశానికి రవీంద్రన్‌తో పాటు అతని కుటుంబసభ్యులు హాజరుకాలేదు. ఈ సమావేశంలో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించడం, కొత్త బోర్డును ఏర్పాటు చేసేందుకు 60 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని ప్రోసస్ కంపెనీ ప్రకటించింది. అయితే, వ్యవస్థాపకులు హాజరు కాకపోవడంతో ఓటింగ్‌ చెల్లదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంపై స్పందించిన రవీంద్రన్, అతని కుటుంబసభ్యులు మార్చి 13 వరకు తీర్మానాలు చెల్లుబాటు కాదన్నారు.


Next Story

Most Viewed