- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
నీటిపై తేలియాడే కొత్త SUV.. 18 నిమిషాల్లో 80% చార్జ్, 1,000 కి.మీ రేంజ్.. ధర ఎంతంటే..

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్ల తయారీ కంపెనీలు కొత్త టెక్నాలజీలతో కార్లను విడుదల చేస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన BYD కంపెనీ మార్కెట్లోకి కొత్త మోడల్ SUVని ఆవిష్కరించింది. దీని పేరు ‘YangWang U8 (యాంగ్‌వాంగ్ U8)’. ఈ SUV ధర దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇది ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తుంది. భూమి ఉపరితలంపై ప్రయాణించడమే కాకుండా, 1 నుంచి 1.5 మీటర్ల వరకు నీటిలో తేలియాడగలదు. దీనిలో 'యాటింగ్' మోడ్‌ను ఇచ్చారు, దీంతో నీళ్లపై 30 నిమిషాల పాటు తేలుతూ ఉంటుంది. అదే నీటిలో 3 కిమీ/గం వేగంతో ప్రయాణించగలదు. దీనిలో 4 మోటార్లను అమర్చారు. 49kWh కెపాసిటీ బ్యాటరీ ఉంది. అలాగే 76 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కూడా ఇచ్చారు. పూర్తి ఇంధన ట్యాంక్, ఫుల్ చార్జింగ్‌తో 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇది 1180 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. చార్జింగ్ విషయానికి వస్తే కేవలం 18 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేయగల ఫాస్ట్ చార్జింగ్‌ను ఇచ్చారు. నీళ్లలో ఉన్నప్పుడు కారులోకి నీళ్లు రాకుండా ఉండటానికి డోర్లు, ఇతర పాయింట్లు పూర్తిగా మూసివేయబడుతుంది. దీన్ని సులభంగా పార్కింగ్ చేయడానికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. అలాగే కారు చుట్టూ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. బయట ఫుటేజీని కారు లోపల నుంచి చూడవచ్చు. దీని డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.