మళ్లీ లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 13 |
మళ్లీ లాభాల్లోకి మారిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాల్లో మారాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు రాణించాయి. విదేశీ పెట్టుబడులు కొనసాగడం, దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగొళ్ల కారణంగా ఒకరోజు నష్టం నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ తాజా ప్రకటనలో వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించినప్పటికీ దేశీయ మార్కెట్లు సానుకూలంగానే ర్యాలీ చేయడం విశేషం. గురువారం ఉదయం నుంచే లాభాల్లో కదలాడిన సూచీలు రోజంతా మెరుగైన లాభాల్లోనే ట్రేడయ్యాయి. విదేశీ పెట్టుబడులతో పాటు ముడి చమురు ధరలు తగ్గడం, త్రైమాసిక ఫలితాల మద్దతు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 555.95 పాయింట్లు ఎగసి 61,749 వద్ద, నిఫ్టీ 165.95 పాయింట్లు లాభపడి 18,255 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాలు గణనీయంగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, ఎస్‌బీఐ, టీసీఎస్, రిలయన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లె ఇండియా, టాటా మోటాస్, ఈటీసీ, పవర్‌గ్రిడ్, విర్పో స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.78 వద్ద ఉంది.



Next Story

Most Viewed