లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఉదయం నుంచి సానుకూలంగా ర్యాలీ చేసిన సూచీలు రోజంతా అదే ధోరణిలో కదలాడాయి. విదేశీ మదుపర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించడంతో పాటు దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. ముఖ్యంగా రియల్టీ, మీడియా రంగాల్లో ఇన్వెస్టర్లు షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీనికితోడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 317.81 పాయింట్లు ఎగసి 62,345 వద్ద, నిఫ్టీ 84.05 పాయింట్లు లాభపడి 18,398 వద్ద ముగిశాయి. నిఫ్టీలో రియల్టీ ఏకంగా 4 శాతానికి పైగా పుంజుకోగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, ఎల్అండ్‌టీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా కంపెనీల స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.32 వద్ద ఉంది.


Next Story