- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మరోసారి కొత్త రికార్డులకు సూచీలు
ముంబై: భారత ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డు ర్యాలీకి ఒకరోజు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో ఉదయం ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైన సూచీలు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడంతో మరింత దూకుడుగా పెరిగాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయి. నిఫ్టీ సైతం చరిత్రలో తొలిసారి 21 వేల పాయింట్ల మార్కును తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో యూఎస్, యూరప్ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో కోత విధిస్తాయనే సంకేతాలు సానుకూల మద్దతునిచ్చాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 303.91 పాయింట్లు ఎగసి 69,825 వద్ద, నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. ఐటీసీ, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.39 వద్ద ఉంది.