బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ

by Dishanational1 |
బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో తమను ఖచ్చితంగా ఆదుకోవాలని ఆన్‌లైన్ గేమింగ్, ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ బడ్జెట్‌లో కేంద్రం పరిశ్రమ పన్నుల విధానాన్ని స్పష్టం చేయాలని, ఈ రంగానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు తప్పనిసరిగా నిధులు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. 2023 ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి కీలకమైన ఏడాది. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. స్కిల్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇదివరకు ప్లాట్‌ఫామ్ ఫీజుపై 18 శాతం జీఎస్టీ చెల్లించేవి. కొత్త నిబంధనల్లో విదేశీ ఆన్‌లైన్ మనీ గేమింగ్ కంపెనీలు తప్పనిసరిగా మనదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కౌన్సిల్ స్పష్టం చేసింది. లేదంటే వారి వెబ్‌సైట్లను బ్లాక్ చేయడంతో పాటు కఠిన చర్యలు ఉండేలా నిబంధనలు రూపొందించింది. ఈ మార్పులు 2023, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, ఈ మార్పుల ప్రభావంపై ఈ ఏడాది మార్చిలో సమీక్ష జరగనుంది. పన్నులపై స్పష్టత ఉండాలని, దానివల్ల వ్యాపారాలకు అనుకూలమైన వాతవరణాన్ని అందించడమే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడులకు విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని మొబైల్ ప్రీమియర్ లీగ్ సీఈఓ నమ్రత స్వామి పేర్కొన్నారు. అలాగే, పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఈ-స్పోర్ట్స్ హబ్‌గా మార్చే ఈ-స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ పెంచే చర్యలను ఆశిస్తున్నట్టు ఈ-స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్, ఏషియన్ ఈ-స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్-ప్రెసిడెంట్ లోకేష్ సుజీ పేర్కొన్నారు.

Next Story

Most Viewed