- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
రూ. 936 కోట్లను సమీకరించిన బీపీసీఎల్

ముంబై: ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్( బీపీసీఎల్) అర్హులైన పెట్టుబడిదారులకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.935.61 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఒక్కొక్కటి రూ. 1,00,000 ముఖ విలువతో 93,561 అన్‌సెక్యూర్డ్, లిస్టెడ్, రేటింగ్, నాన్-క్యుములేటివ్, రీడీమ్ చేయదగిన ఎన్‌సీడీలను కేటాయించినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.58 శాతం వడ్డీ రేటుతో వీటిని కేటాయించారు. మెచ్యూరిటీ తేదీని మార్చి 17, 2026 గా నిర్ణయించారు.
మూడు విడతలుగా వడ్డీ చెల్లింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. నిర్ణీత తేదీల్లో వడ్డీ చెల్లించడం జరగకపోతే అసలు వడ్డీ రేటు కంటే సంవత్సరానికి రెండు శాతం అదనపు వడ్డీని చెల్లించనున్నట్లు బీపీసీఎల్ పేర్కొంది. ఎన్‌సీడీలను జారీ చేయడం ద్వారా చమురు కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,500 కోట్లను సమీకరించాలని చూస్తోంది.