19 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించిన BPCL

by Disha Web Desk 17 |
19 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించిన BPCL
X

బెంగళూరు: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా 19 ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులోని 15 హైవేల వెంబడి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కారిడార్‌లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దారిలో దాదాపు ప్రతి 100 కి.మీ కి ఒక ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ అందుబాటులో ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. మొత్తంగా 110 ఫ్యూయల్ స్టేషన్ల మధ్య ఈ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దక్షిణాది రిటైల్ హెడ్ పుష్ప్ కుమార్ నాయర్ మాట్లాడుతూ.. ఈవీని 30 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే కనీసం 125 కిలోమీటర్ల దూరం వెళ్ళేలా రూపొందించాం. అందుకే ప్రతి 100 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed