కనీస ప్లాన్ రూ. 155ను విస్తరించిన ఎయిర్‌టెల్!

by Disha Web Desk 17 |
కనీస ప్లాన్ రూ. 155ను విస్తరించిన ఎయిర్‌టెల్!
X

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన కనీస రీఛార్జ్ ప్లాన్‌ను పెంచిన సంగతి తెలిసిందే. 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ బేస్‌ ప్లాన్‌ ధరను రూ.155కు చేర్చింది. గతేడాది నవంబర్‌లో దీన్ని హర్యానా, ఒడిశా సర్కిళ్లలో మాత్రమే అమలు చేసింది. తాజాగా మరో ఏడు సర్కిళ్లలో బేస్ ప్లాన్ రూ. 155 కు పెంచుతూ మంగళవారం నిర్ణయించింది.

ఈ ప్లాన్ ద్వారా సబ్‌స్క్రైబర్లు 28 రోజుల పాటు 1జీబీ డేటా, 300 మెసేజ్‌ల సౌకర్యాలను పొందుతారు. ఈ పెంపు వల్ల వినియోగదారులపై 57 శాతం భారం పెరగనుండగా, కంపెనీకి వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) పెరుగుతుంది.

తమ వినియోగదారులకు మెరుగైన నెట్‌వర్క్ సౌకర్యాలను అందించేందుకు బేస్ టారిఫ్ ధరను పెంచామని, అందులో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు ఇదివరకు కంటే ఎక్కువగా 1జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు వినియోగించవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. మొదట రెండు సర్కిళ్లలో, ఇప్పుడు ఏడు సర్కిళ్లలో బేస్ ప్లాన్ ధరను పెంచిన ఎయిర్‌టెల్ రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.


Next Story

Most Viewed