టైమ్ లిమిట్ నిబంధనతో తిరిగి అందుబాటులోకి వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్!

by Harish |
టైమ్ లిమిట్ నిబంధనతో తిరిగి అందుబాటులోకి వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్స్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) దేశీయంగా తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడాది క్రితం ప్రభుత్వం బీజీఎంఐ గేమ్‌ను నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మళ్లీ మార్కెట్లోకి వచ్చిన గేమ్‌లో పలు మార్పు చేసినట్టు తెలుస్తోంది.

ఈసారి వినియోగదారులు ఈ గేమ్ ఆడటానికి టైమ్ లిమిట్‌ను విధించారు. 18 ఏళ్ల వయసు లోపు పిల్లలు రోజులో 3 గంటలు మాత్రమే ఆడటానికి వీలుంటుంది. ఆ పైన వయసు వారికి కూడా రోజులో 6 గంటలు మాత్రమే అడాల్సి ఉంటుంది. అంతేకాకుండా 18 ఏళ్ల వయసు లోపు పిల్లలకు పేరెంటల్ వెరిఫికేషన్ అవసరమని, ఒకవేళ గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ ఒకేసారి అందుబాటులోకి వచ్చే వీలుండకపోవచ్చని బీజీఎంఐ మాతృసంస్థ క్రాఫ్టన్ వెల్లడించింది.

దశలవారీగా వినియోగదారులకు బీజీఎంఐ గేమ్ ఆడటానికి అనుమతి లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఏడాది క్రితం నిషేధానికి గురైన బీజీఎంఐ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం ఇటీవలే అనుమతులిచ్చింది. ప్రస్తుతం మూడు నెలలు మాత్రమే ట్రయల్‌గా అనుమతిచ్చామని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.Next Story

Most Viewed