ఆ దేవుడి హుండీ డబ్బులు మేము తీసుకోం.. బ్యాంకులు షాకింగ్ డెసిషన్

by Disha Web Desk 2 |
ఆ దేవుడి హుండీ డబ్బులు మేము తీసుకోం.. బ్యాంకులు షాకింగ్ డెసిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేవాలయ కమిటీకి షాకిచ్చేలా బ్యాంకులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. షిరిడీ సాయిబాబాకు హుండీలో భక్తులు వేసే డబ్బులు తమ బ్యాంకులో డిపాజిట్ చేసుకోలేమని షిరిడీ సాయి సేవా సమితికి బ్యాంకులు చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చాయి. వివరాల్లోకి వెళితే.. గత ఏడు నెలల్లో షిరిడీ సాయిబాబా గుడికి రూ.188 కోట్ల కానుకలు వచ్చాయి. అందులో రూ.11 కోట్లకు పైగా నాణాలు ఉన్నాయి.

ఈ డబ్బులన్నింటినీ షిరిడి సాయి సేవా ట్రస్ట్ పేరు మీదున్న 13 బ్యాంకుల్లో ఇప్పటివరకు డిపాజిట్ చేస్తూ వచ్చారు. అయితే, అనూహ్యంగా రూ. 11 కోట్ల నాణాలను డిపాజిట్ చేసుకోవడానికి ఇటీవల ఏ బ్యాంకు ముందుకు రావట్లేదట. బ్యాంకుల్లో ప్లేస్ లేదని, అంత పెద్ద మొత్తంలో నాణాలు లెక్కించడం కష్టమని ఆ డబ్బును డిపాజిట్ చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ట్రస్ట్ సీఈఓ జయదేవ్ యాదవ్ ఈ విషయంలో బ్యాంకులపై కంప్లైంట్ చేస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది.

Also Read...

ఏప్రిల్ 21: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

Next Story