ATM వినియోగదారులకు బిగ్ షాక్.. ఇక నుంచి బాదుడే

by Dishanational2 |
ATM వినియోగదారులకు బిగ్ షాక్.. ఇక నుంచి బాదుడే
X

దిశ, వెబ్‌డెస్క్ : ATM వినియోగదారులకు చుక్కలు చూపెట్టడానికి బ్యాంకులు రెడీ అయ్యాయి. పరిమితికి మించి ATM ద్వారా లావాదేవీలు జరిపితే ప్రతి లావాదేవీకి రూ.21 ఛార్జ్ విధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుంచి ఏటీఎం కేంద్రాలలో అదనంగా జరిపే లావాదేవిలకు ఛార్జ్ వసూలు చేయనున్నాయి బ్యాంకులు. ఇక ఇప్పటికే కొన్ని బ్యాంకులలో అదనపు లావాదేవీలకు ఛార్జ్ వసూలు చేస్తున్నాయి. అయితే ప్రతి బ్యాంకు కస్టమర్‌లు ప్రతి నెలా వారి బ్యాంక్ ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలకు అనుమతినిస్తాయి. ఇతర బ్యాంక్ ఏటీఎంలకు పరిమితి మూడు ఉచిత లావాదేవీలు. నాన్-మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు చేయవచ్చును.

ఏ కార్డుకు ఎంత ఛార్జ్ వసూలంటే ?

  • ప్రధాన బ్యాంకులు డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ చార్జీలు క్లాసిక్ డెబిట్ కార్డుకు 125రూపాయలు ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తాయి.
  • సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై 125రూపాయలు ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తాయి.
  • యువ, గోల్డ్ కార్డుకు 175 రూపాయలు,ప్లస్ జీఎస్‌టీ, కాంబో, మై కార్డు ప్లస్ డెబిట్ కార్డులపై 250 రూపాయలు వార్షిక నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తాయి.
  • ప్లాటినం, ప్రైడ్, ప్రీమియం, బిజినెస్ డెబిట్ కార్డులపై 350 రూపాయలు ప్లస్ జీఎస్‌టీని వసూలు చేయనున్నాయి.
  • డెబిట్ కార్డు రీ ప్లేస్ మెంటు చార్జీలు 300రూపాయలు ప్లస్ జీఎస్‌టీ, డూప్లికేట్ పిన్, పిన్ రీజనరేషన్ చేసినా 50 రూపాయల చార్జీతోపాటు జీఎస్‌టీని బ్యాంకులు విధించనున్నాయి.

Next Story

Most Viewed