- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Bank holidays in June 2023: నోట్ల మార్పిడి వేళ ఖాతాదారులకు బిగ్ షాక్.. జూన్‌లో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకులతో పని లేని వారు ఎవరూ ఉండరు. రిచ్ పర్సన్స్ దగ్గర నుండి సామాన్యుడి వరకు అందరికీ బ్యాంకులతో అవసరం ఉంటుంది. అందులోనూ తాజాగా ఆర్‌బీఐ రూ.2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మే-23 నుంచి సెప్టెంబర్-30వ తేదీ లోగా రూ. 2 వేల నోట్లు మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ క్రమంలో వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా రిలీజ్ చేసింది. దీని ప్రకారం జూన్ నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ 12 సెలవులు ఏంటో తెలుసుకుందాం రండి..
జూన్ నెలలో బ్యాంకుల సెలవులు ఇవే..
జూన్-4: ఆదివారం
జూన్-10: రెండవ శనివారం
జూన్-11: ఆదివారం
జూన్-15: రాజా సంక్రాంతి కారణంగా మిజోరం, ఒడిశాలో బ్యాంకులకు సెలవు.
జూన్-18: ఆదివారం
జూన్-20: రథయాత్ర జరుగుతున్న కారణంగా ఒడిశా, మణిపూర్‌లో సెలవు.
జూన్-24: జూన్ చివరి, నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జూన్-25: ఆదివారం సెలవు
జూన్-26: ఖర్చీ పూజ కారణంగా త్రిపురలో మాత్రమే బ్యాంకులకు సెలవు
జూన్-28: ఈద్ ఉల్ అజా కారణంగా మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, కేరళలో బ్యాంకులకు సెలవు.
జూన్-29: ఈద్-ఉల్-అజా కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
జూన్-30: ఈద్-ఉల్-అజా కారణంగా కారణంగా మిజోరం, ఒడిశాలోని బ్యాంకులకు సెలవు.
దీంతో మొత్తం 12 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.