FDలపై వడ్డీ రేట్లను పెంచిన బంధన్ బ్యాంక్!

by Disha Web Desk 17 |
FDలపై వడ్డీ రేట్లను పెంచిన బంధన్ బ్యాంక్!
X

కోల్‌కతా: ప్రముఖ ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. సోమవారం(ఫిబ్రవరి 6) నుంచే అమలయ్యే విధంగా బ్యాంకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల మధ్య కాలవ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై సాధారణ ఖాతాదారులకు 3-8 శాతం మధ్య, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీని ఇవ్వనున్నట్టు బ్యాంకు తెలిపింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు అమలవుతాయి.

అధిక వడ్డీ సాధారణ ఖాతాదారులకు ఏడాది డిపాజిట్‌పై 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని పొందవచ్చని బ్యాంకు పేర్కొంది. తాజా నిర్ణయం ద్వారా తాము బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నామని బంధన్ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, సుదీర్ఘ కాలానికి సంబంధించి సాధారణ ఖాతాదారులకు 600 రోజుల డిపాజిట్లపై 8 శాతం లభించనుండగా, సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.50 శాతం వడ్డీ అందుతుంది.


Next Story

Most Viewed