CNG బైకులను తీసుకురావాల్సిన అవసరం ఉంది: బజాజ్ ఆటో ఎండీ!

by Harish |
CNG బైకులను తీసుకురావాల్సిన అవసరం ఉంది: బజాజ్ ఆటో ఎండీ!
X

న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగంలో సీఎన్‌జీ కార్లు, ఆటోల వాటా క్రమంగా పెరుగుతున్నాయి. సాంప్రదాయ ఇంధనానికి ప్రత్యామ్నాయంగా కంపెనీలు ఈవీలతో పాటు సీఎన్‌జీ వాహనాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో సీఎన్‌జీ విభాగంలో బైకులు తీసుకురావాల్సిన అవసరం ఉందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎన్‌జీతో నడిచే స్కూటర్లు, బైకులు ఎందుకు ఉండకూడదు. గత కొన్నాళ్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అయితే, భద్రత, ఛార్జింగ్, బ్యాటరీ సహా వివిధ రకాల సవాళ్లు ఈవీ విభాగంలో ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ బైకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే బజాజ్ ఆటో సీఎన్‌జీ బైకులను తీసుకొచ్చే అవకాశం ఉందని రాజీవ్ అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో సీఎన్‌జీ వాహనాలపై ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ఆయన కోరారు. ప్రస్తుతం బజాజ్‌కు సీఎన్‌జీ త్రీ-వీలర్ విభాగంలో 70 శాతం వాటా ఉంది. రాజీవ్ బజాజ్ ఆలోచనల ప్రకారం సీఈన్‌జీ బైకులు మార్కెట్లోకి వస్తే ద్విచక్ర వాహన రంగంలో పెను మార్పులు ఉండే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed