Bikes: పండుగ సీజన్‌లో బజాజ్ నుంచి రెండు అదిరిపోయే కొత్త మెడల్స్ బైకులు

by Harish |
Bikes: పండుగ సీజన్‌లో బజాజ్ నుంచి రెండు అదిరిపోయే కొత్త మెడల్స్ బైకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కంపెనీ బజాజ్ నుంచి రెండు కొత్త మోడల్స్ ఇండియాలో విడుదల అయ్యాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ మేరకు వీటిని 400 సీసీ కేటగిరీలో లాంచ్ చేశారు. ఈ మోడల్స్ పేరు ‘ట్రయంఫ్ స్పీడ్ T4’, ‘MY25 స్పీడ్ 400’. ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకోడానికి ఈ కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ T4 ధర రూ. 2.17 లక్షలు( ఢిల్లీ ఎక్స్-షోరూమ్), స్పీడ్ 400 ధర రూ. 2.40 లక్షలు(ఢిల్లీ ఎక్స్-షోరూమ్).

ట్రయంఫ్ స్పీడ్ T4 వేరియంట్.. 398 cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 30.6 bhp పవర్, 36Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనిలో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌ను అందించారు. ముందు LED లైటింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్‌తో కూడిన అధునాతన సస్పెన్షన్‌తో సహా ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం, ముందువైపు 300 mm డిస్క్,వెనుకవైపు 230 mm డిస్క్‌ను అందించారు. మెరుగైన భద్రత కోసం డ్యూయల్-చానల్ ABS ఉంది.

MY25 స్పీడ్ 400 వేరియంట్.. ఈ మెడల్ కూడా 398 cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 39.5bhp పవర్, 37.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో కూడా 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌ను అందించారు. ఈ బైక్ రేసింగ్ ఎల్లో, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది.

Next Story