బజాజ్ ఆటో చేతికి ట్రయంఫ్ కార్యకలాపాలు!

by Disha Web Desk 17 |
బజాజ్ ఆటో చేతికి ట్రయంఫ్ కార్యకలాపాలు!
X

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్ మోటార్‌సైకిళ్ల సేల్స్, మార్కెటింగ్ కార్యకలాపాలను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇరు కంపెనీల మధ్య 2020లోనే దీనికి సంబంధించిన వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. తాజాగా ట్రయంఫ్ అన్ని వ్యవహారాలను బజాజ్ ఆటో చూసుకోనున్నట్టు వెల్లడించింది.

ఇప్పటికే చేతక్ ఈవీ, కేటీఎం, బజాజ్ టూ-వీలర్, త్రీ-వీలర్ వ్యాపార కార్యకలాపాలను బజాజ్ ఆటో నిర్వహిస్తోంది. ఇకమీదట ట్రయంఫ్ బ్రాండ్ వాహనాల అమ్మకాలను చేపట్టనుంది. ఈ నిర్ణయంతో బజాజ్ ఆటో మొత్తం ఐదు ద్విచక్ర వాహనాల అమ్మకాలను నిర్వహించనుంది. 2020లో జరిగిన ఒప్పందం ప్రకారమే ఇరు కంపెనీలు కలిసి మిడ్-సైజ్ మోటార్‌సైకిళ్లను తీసుకొచ్చేందుకు నిర్ణయించాయి. ఈ ఏడాదిలోగా బజాజ్ ట్రయంఫ్ బైకును తీసుకురానున్నాయి. అయితే, కొత్త బైక్ కు సంబంధించి ఇంకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

కాగా, ప్రస్తుతం ట్రయంఫ్ ఆధ్వర్యంలో ఉన్న డీలర్‌షిప్‌ల కార్యకలాపాలు మునుపటిలాగే కొనసాగుతాయి. బజాజ్ ఆటోతో ఒప్పందం ట్రయంఫ్ విస్తరణకు దోహదపడుతుందని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ వెల్లడించారు.

Also Read..

2022-23లో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించనున్న పీఎస్‌బీలు!



Next Story

Most Viewed