గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. 12 EMIలు మాఫీ

by Disha Web Desk 17 |
గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. 12 EMIలు మాఫీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. బ్యాంక్ ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తోంది. దీనిలో లోన్ ఈఎంఐ మాఫీని అందిస్తుంది. కొత్తగా ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం, పాత లేదా కొత్త ఇంటి కొనుగోలు వంటి వాటి కోసం బ్యాంకు ఫాస్ట్ ఫార్వర్డ్ హోమ్ లోన్స్‌‌ను ఆఫర్ చేస్తుంది. కొంతమంది కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది దీనిలో కనీసం రూ.30 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ముఖ్యంగా దీనిలో 12 EMIల మాఫీ చేసే బెనిఫిట్ కూడా ఉంది. అలాగే, డోర్‌స్టెప్ సర్వీస్‌తో పాటు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

10 ఏళ్ల పాటు లోన్ EMI కడితే అందులో 6 EMIలు మాఫీ బెనిఫిట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే 15 ఏళ్ల పాటు లోన్ కడితే 10 EMIల మాఫీ లభిస్తుంది. తిరిగి చెల్లింపుల ట్రాక్ సరిగ్గా ఉన్నవారికి ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఈ హోమ్ లోన్ టెన్యూర్ కనీసం 20 ఏళ్లు పెట్టుకోవాలి. ముఖ్యంగా సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. 751 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి వడ్డీ రేటు 8.7 శాతం నుంచి మొదలవుతుంది. అదే స్వయం ఉపాధి గల వారికి వడ్డీ రేటు 9.1 శాతం నుంచి ఉంటుంది.

Next Story