రూ.7 వేల కోట్ల లాభాలను సాధించిన యాక్సిస్ బ్యాంక్

by Disha Web Desk 17 |
రూ.7 వేల కోట్ల లాభాలను సాధించిన యాక్సిస్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ రూ.7,130 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బ్యాంక్ రూ. 5,728 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2024(జనవరి-మార్చి )లో మొత్తం ఆదాయం రూ. 35,990 కోట్లుగా ఉంది, అంతకు ముందు ఏడాది కాలంలో ఇది రూ. 28,758 కోట్లుగా ఉంది. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం గత ఏడాది రూ. 11,742 కోట్లుగా నమోదు కాగా, ఈ సారి అది 11.47 శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాలంలో 1.24 మిలియన్ కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసింది.

బ్యాంకు స్థూల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్(ఎన్‌పీఏ) 1.43 శాతంగా నమోదైంది. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 2.02 శాతం తగ్గింది. నికర ఎన్‌పీఏలు 0.31 శాతంగా ఉన్నాయి. త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,185 కోట్లుగా ఉన్నాయి. తాజాగా జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఎఫ్‌వై24 కోసం ఈక్విటీ షేరుకు రూ. 1 డివిడెండ్‌ను సిఫార్సు చేశారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ, ఎఫ్‌వై24లో బ్యాంక్ స్థిరమైన పురోగతిని సాధించింది. కొత్త అవకాశాలను అందుకోవడంలో మేము ముందు ఉన్నాం. రాబోయే కాలంలో బ్యాంక్ మరింత వృద్ధి చెందుతుందని అన్నారు.

Next Story

Most Viewed