ప్రధాన నగరాల్లో సగటున 5 శాతం పెరిగిన ఇళ్ల ధరలు!

by Disha Web Desk 7 |
ప్రధాన నగరాల్లో సగటున 5 శాతం పెరిగిన ఇళ్ల ధరలు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఇళ్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరగడం, నిర్మాణ వ్యయం అధికం కావడం వంటి పరిణామాలతో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస ఆస్తుల ధరలు సగటున 5 శాతం పెరిగాయని ప్రముఖ రియల్టర్ల సంఘం క్రెడాయ్, కన్సల్టెన్స్ సంస్థ కొలియర్స్ ఇండియా, డేటా అనలిటిక్స్ సంస్థ లియాసెస్ ఫోరాస్ సంయుక్త నివేదిక తెలిపింది. అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా 10 శాతం పెరిగాయి. సమీక్షించిన కాలంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు కరోనా మహమ్మారికి ముందు స్థాయిని అధిగమించాయి.

ఇది డిమాండ్, కొత్త నిర్మాణాల అందుబాటులో ఉండటాన్ని సూచిస్తుందని నివేదిక పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత అధికంగా అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు గతేడాది కంటే 9 శాతం పెరిగింది. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగిపోయి చదరపు అడుగుకు రూ. 9,218కి చేరుకుంది. బెంగళూరులో 4 శాతం పెరగ్గా, పూణెలో 5 శాతం, చెన్నైలో 1 శాతం పెరిగాయి. కోల్‌కతాలో 8 శాతం, ముంబైలో 1 శాతం పెరిగింది. ఇటీవల పెరుగుతున్న వడ్డీ రేట్ల మధ్య ఈఎంఐ తగ్గింపు ఆఫర్లతో డెవలపర్లు వినియోగదారులను చేరువ అవుతున్నారు. రానున్న పండుగ సీజన్‌లో కొత్త నిర్మాణాలు అందుబాటులో రానున్న నేపథ్యంలో అమ్మకాలు మరింత పెరుగుతాయని లియాసెస్ ఫోరస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వెల్లడించారు.

సెమీకండక్టర్ల తయారీలో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి టీహబ్ ప్రత్యేక కార్యక్రమం!

Next Story