5.5 శాతం క్షీణించిన వాహన ఎగుమతులు

by Gopi |
5.5 శాతం క్షీణించిన వాహన ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ వివిధ దేశాలు ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్స్రం భారత ఆటోమొబైల్ ఎగుమతులు 5.5 శాతం క్షీణించాయి. ఈ మేరకు పరిశ్రమల సంఘం సియామ్ తాజా ప్రకటనలో వెల్లడించింది. అంతకుముందు 2022-23లో మొత్తం 45 లక్షల వాహనాలు ఎగుమతి చేయగా, 2023-24లో 47.61 లక్షల యూనిట్లు విదేశాలకు రవాణా అయ్యాయి. వివిధ విదేశీ మార్కెట్లలో పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని సియామ్ అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ చెప్పారు. భారత కమర్షియల్, టూ-వీలర్ వాహనాల ఎగుమతులు జరిగే కొన్ని దేశాలు విదేశీ మారకద్రవ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఇతర విభాగాల రవాణా భారీగా తగ్గడం మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమపై ఒత్తిడి పెంచిందని ఆయన వివరించారు. ఈ ఏడాది ప్రారంభంలో పరిస్థితులు సానుకూలంగా మారుతున్న పరిణామాలను గమనిస్తున్నాము. పరిశ్రమ ఎగుమతుల రికవరీ కనిపిస్తోందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు విదేశీ మార్కెట్లలో గిరాకీ పెరుగుతోందన్నారు. సియామ్ డేటాను పరిశీలిస్తే.. 2023-24లో ప్యాసింజర్ వాహనాల విభాగం 1.4 శాతం పెరిగి 6.72 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. టూవీలర్ విభాగం 5.3 శాతం, వాణిజ్య వాహనాల విభాగం 16 శాతం, త్రీ-వీలర్ విభాగం 18 శాతం క్షీణించాయి.

Next Story