సెమీకండక్టర్ కొరత తగ్గడంతో మార్కెట్లోకి మరిన్ని కొత్త ఉత్పత్తులు

by Disha Web Desk 17 |
సెమీకండక్టర్ కొరత తగ్గడంతో మార్కెట్లోకి మరిన్ని కొత్త ఉత్పత్తులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ పరిశ్రమలను వేధిస్తున్న సెమీకండక్టర్ కొరత తగ్గడంతో ఆటోమొబైల్ కంపెనీలు రానున్న నెలల్లో రికార్డు స్థాయిలో కొత్త ఉత్పత్తుల లాంచ్‌లకు సిద్ధమవుతున్నాయి. చిప్‌ల సరఫరా గొలుసు సమస్యల కారణంగా కొంతకాలంగా ఆటోమేకర్ కంపెనీలు తమ ఉత్పత్తులను చాలా వరకు తగ్గించాయి. కరోనా మహామ్మరి కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. స్మార్ట్ ఫోన్‌లు, కంప్యూటర్‌లు, కార్లు మొదలగు రంగాలకు సెమీకండక్టర్ అతి ముఖ్యమైన అంశం.

"ఆటో పరిశ్రమలో, కొత్త మోడళ్లను సాధారణంగా 38 నుండి 46 నెలల ముందుగానే ప్లాన్ చేస్తారు. కొవిడ్ లాక్‌డౌన్ వలన కొత్త మోడళ్ల అభివృద్దిపై కొంత మేరకు ప్రభావం చూపింది. కానీ ఆటో తయారీ కంపెనీలు వేగవంతమైన ప్రాతిపదికన అభివృద్ధి పనులను పునఃప్రారంభించాయి. ఇది బహుశా ప్రస్తుత సంవత్సరంలో లాంచ్‌ల సంఖ్యను వివరిస్తుంది" అని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. రానున్నది పండగల సీజన్‌ కావడంతో అమ్మకాలలో వృద్ది కనబడుతుందని, చాలా మంది తయారీదారులు కొత్త లాంచ్‌లతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పారు.

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ పండుగ సీజన్‌లో EV లాంచ్‌లపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. అదే విధంగా Q1, ఎఫ్‌వై 23లో 1.3 లక్షలకు పైగా వాహనాల రికార్డు విక్రయాలను చూసిన టాటా మోటార్స్, పండుగ సీజన్‌లో కూడా మరిన్ని విక్రయాలను నమోదు చేయాలని చూస్తోంది. "డిమాండ్ ఔట్‌లుక్ బలంగా ఉన్నప్పటికీ, విడిభాగాల కొరత కారణంగా సరఫరా వైపు సవాళ్లు కొనసాగుతున్నాయి. అయితే, ఇది ఉత్పత్తి ప్రయోగ వ్యూహాలను ప్రభావితం చేయలేదు. పండుగ కాలంలో కొంతమంది తయారీదారులు డిమాండ్ ఊపందుకోవడం కోసం ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాలను అందిస్తున్నారు. మేము కూడా మోడల్, ట్రిమ్ ఆధారంగా రూ. 20,000-40,000 శ్రేణిలో వినియోగదారులకు ఆఫర్‌లను విడుదల చేశాము" అని టాటా మోటార్స్ మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ కేర్ VP రాజన్ అంబ అన్నారు.

ఎంట్రీ-లెవల్ అమ్మకాలపై ఒత్తిడిని ఎదుర్కొంటున్న హీరో మోటోకార్ప్ కూడా కస్టమర్లను ఆకర్షించడానికి కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని హీరో కంపెనీ తెలిపింది.


Next Story

Most Viewed