శాంసంగ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి యాపిల్

by Dishanational1 |
శాంసంగ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దశాబ్దానికి పైగా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణ కొరియా బ్రాండ్ శాంసంగ్‌కు యాపిక్ షాక్ ఇచ్చింది. మొదటిసారిగా 12 ఏళ్ల నుంచి ఉన్న శాంసంగ్‌ను వెనక్కి నెట్టి యాపిల్ అగ్రస్థానం దక్కించుకుంది. 2023 ఏడాదికి సంబంధించి ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాల ప్రకారం, 2010 నుంచి గ్లోబల్ మొబైల్ సరఫరాలో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంటోంది. గతేడాది యాపిల్ 23.5 కోట్ల యునిట్లను సరఫరా చేసింది. ఇది మొత్తం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరఫరాలో ఐదో వంతుకు సమానం. దీంతో శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసింది. ఇదే సమయంలో శాంసంగ్ 22.66 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేసింది. ఇది 19.4 శాతం వాటాకు సమానం. ఈ రెండు కంపెనీల తర్వాత షావోమీ, ఒప్పో కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా కొత్త మోడల్ ఫోన్‌ల విడుదల సమయంలో పాత వాటిపై ఆఫర్లు, వడ్డీ లేని రుణాలు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ వంటి అంశాలు యాపిల్ విజయానికి కారణమని ఐడీసీ వెల్లడించింది. అయితే, యాపిల్‌కు కీలక మార్కెట్‌గా ఉన్న చైనాలో ప్రభుత్వం నుంచి సవాళ్లు, అదే దేశానికి చెందిన హువావే నుంచి పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ యాపిల్ గ్లోబల్ మార్కెట్లో అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం.

Next Story

Most Viewed