ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్

by Disha Web |
ఖాతాదారులకు అలర్ట్: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకు ఖాతాదారులు తమకు ఏమైనా బ్యాంకు పనులు ఉంటే త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. రేపు 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 27వ తేదీన మాత్రం బ్యాంకులు పని చేస్తాయి. తర్వాత 28వ తేదీన నాలుగో శనివారం సెలవు, 29న ఆదివారం సెలవు. తర్వాత జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు పెన్షన్ అప్టేడ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వారానికి 5 రోజులు పని దినాలు, వేతన సవరణ డిమాండ్లతో రెండు రోజులు సమ్మె చేయనున్నారు. దీంతో వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మధ్యలో 27 న మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.


Next Story